![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 03:10 PM
కోబాల్ట్ బ్లూలో పాత్రకు ప్రసిద్ధి చెందిన అంజలి శివరామన్ నటించిన తమిళ చిత్రం 'బాడ్ గర్ల్' గురించి చాలా మందికి ఇంకా తెలియకపోవచ్చు. వ్యాషా భారత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెట్రీ మరాన్ మరియు అనురాగ్ కశ్యప్ నిర్మించారు. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాని మేకర్స్ సెప్టెంబర్ 5న విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజులలో చిత్ర బృందం ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనుంది. ఈ చిత్రంలో శాంతి ప్రియా, సరన్య రవిచంద్రన్, హ్రిధు హారూన్, టీజయ్ అరుణసలాం కీలక పాత్రలలో నటిస్తున్నారు. వెట్రీ మరాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు, అమిత్ ట్రివెడి సంగీతం స్వరపరిచారు.
Latest News