![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 01:34 PM
తెలుగు నటుడు నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన అతని కొత్త చిత్రం 'ఎలెవెన్' మే 16, 2025న విడుదల అయ్యింది. క్రైమ్ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో నటుడు ఒక పోలీసుగా నటించాడు. ఈ సినిమా కి సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా, సింప్ల్య్ సౌత్ లో తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో ప్రసారానికి అందుబాటులోకి ఉంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ లోక్కేష్ అజ్ల్స్ ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా కథ రాసేటప్పుడు తాను ప్రముఖ కోలీవుడ్ నటుడు శింబు ని ఉహించుకొని రాసినట్లు వెల్లడించారు. కానీ ఈ ప్రాజెక్ట్ కి కొన్ని కారణాల వాళ్ళ శింబు చేయలేదు అని చెప్పారు. లోక్కేష్ అజ్ల్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రేయా హరిని మహిళా ప్రధాన పాత్రలో నటించారు, శశాంక్, అభిరామి, దిలీపాన్, రియత్వికా, ఆదుకళం నరేన్, రవి వర్మ, మరియు కీర్తి దమరాజు సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ద్విభాషా చిత్రాన్ని AR ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది. ఈ సినిమాకి డి. ఇమ్మాన్ సంగీతాన్ని స్వరపరిచాడు.
Latest News