![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 08:48 PM
సినీ ఇండస్ట్రీలో ఎంతో స్టార్‌డమ్ వచ్చినా ఈ తర్వాత అవకాశాలు లేక హీరోలు ఫేడౌట్ అవుతుంటారు. ఈ కోవలోకి చెందిన వారే వడ్డే నవీన్. ఎన్నో సక్సెస్‌ఫుల్ మూవీలు తీసి ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ 2016 తర్వాత వెండితెరపై కనిపించలేదు. అయితే తాజాగా ‘వడ్డే క్రియేషన్స్’ పేరుతో నవీన్ నిర్మాణ సంస్థ ప్రారంభించారు. దీంతో నటుడిగా కాకపోయినా నిర్మాతగా రీఎంట్రీ ఇస్తున్నారని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.వడ్డే నవీన్ సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఆయన ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ కుమారుడు. తండ్రి సినీ రంగానికి చెందినవారైనప్పటికీ, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. 1996లో 'క్రాంతి' అనే సినిమాతో నవీన్ హీరోగా తెరంగేట్రం చేసారు. ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో నటించిన 'కోరుకున్న ప్రియుడు' చిత్రంతో పేరు తెచ్చుకున్నారు. 'పెళ్లి' సినిమా వడ్డే నవీన్‌కు స్టార్‌డమ్‌ను తీసుకొచ్చింది. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో, నవీన్ యూత్ ఫ్యామిలీ ఆడియన్స్‌లో బాగా పాపులర్ అయ్యారు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ పల్లెటూర్లలో ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి.
Latest News