![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 06:16 PM
సుమైరా స్టూడియోస్‌తో కలసి హీరో కిరణ్ అబ్బవరం తన కేఏ ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్న చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. తేజేశ్వర్‌రెడ్డి వేల్పుచర్ల సహనిర్మాత. సాయితేజ్, వేదశ్రీ జంటగా నటిస్తున్నారు. వి. మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చిత్రబృందం గురువారం టైటిల్‌ను ప్రకటించి, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. గ్రామీణ నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని యూనిట్ తెలిపింది.
Latest News