![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 06:37 PM
రౌడీ స్టార్ విజయూ దేవరకొండ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ డ్రామా 'కింగ్డమ్' తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రం జూలై 31, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇటీవలే చిత్ర బృందం ఈ సినిమా యొక్క రిలీజ్ డేట్ ప్రోమోని విడుదల చేసింది. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ ప్రోమో ఇప్పుడు 14 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రేండింగ్ వన్ పోసిషన్ లో ఉన్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. భగ్యాశ్రీ బోర్స్ మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రానికి గౌతమ్ టిన్ననురి దర్శకత్వం వహిస్తుండగా, సత్య దేవ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. సీతారా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ ఆధ్వర్యంలో నాగ వాంసి మరియు సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.
Latest News