![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 08, 2025, 06:39 PM
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ చివరిసారిగా 'మాక్స్' అనే యాక్షన్-ప్యాక్డ్ డ్రామాలో కనిపించరు. ఈ చిత్రం శాండల్వుడ్ మరియు టాలీవుడ్ రెండింటిలో బాక్సాఫీస్ వద్ద బలమైన ప్రభావాన్ని చూపింది. విజయ్ కార్తికేయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొట్టమొదట కన్నడలో డిసెంబర్ 25, 2024న విడుదలైంది మరియు రెండు రోజుల తరువాత తెలుగులో ప్రదర్శించబడింది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, సంయుక్త హోర్నాడ్, సుకృత వాగ్లే మరియు అనిరుధ్ భట్ నటించారు. ప్రఖ్యాత కలైపులి ఎస్. థాంయు నిర్మించిన మాక్స్ ప్రతిభావంతులైన అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని కలిగి ఉంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క సీక్వెల్ ని కన్ఫర్మ్ చేసారు. రానున్న రోజులలో చిత్ర బృందం ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన వివరాలని వెల్లడి చేయనున్నారు.
Latest News