|
|
by Suryaa Desk | Mon, Jul 07, 2025, 10:10 AM
బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల, నటుడు విష్ణు విశాల్ కుమార్తెకు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ పేరు పెట్టారు. సోషల్ మీడియా వేదికగా ఈ విశేషాన్ని పంచుకుంటూ విష్ణు విశాల్ ఆనందం వ్యక్తం చేశారు. అమీర్ ఖాన్‌తో కలిసి తన కుటుంబం దిగిన ఫొటో పంచుకున్నారు. తమ కుమార్తె పేరు మిరా అని తెలిపారు. "మా బేబీకి పేరు పెట్టడానికి హైదరాబాద్ వచ్చిన అమీర్ ఖాన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు" అని విష్ణు పేర్కొన్నారు.2021 ఏప్రిల్ 22న విష్ణు విశాల్- జ్వాల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న వీరికి పాప పుట్టడం విశేషం. ‘ఎఫ్‌ఐఆర్’, ‘లాల్ సలామ్’ తదితర డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమ్యారు విష్ణు. ‘సితారే జమీన్ పర్’ విజయోత్సాహంలో ఉన్న ఆమిర్ ఇటీవల హైదరాబాద్ వచ్చారు. కన్హా శాంతివనాన్ని (నందిగామ) శనివారం సందర్శించిన ఆయన.. విష్ణు విశాల్ ఫ్యామిలీని ఆదివారం కలిశారు. విశాల్ కుటుంబంతో ఆమిర్‌కు మంచి అనుబంధం ఉంది. గతంలో.. తన తల్లికి చికిత్స చేయించే క్రమంలో ఆమిర్.. విష్ణు విశాల్ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నట్టు కోలీవుడ్‌లో వార్తలొచ్చాయి.
Latest News