|
|
by Suryaa Desk | Fri, Jul 04, 2025, 06:48 PM
ప్రముఖ OTT ప్లాట్‌ఫాం జియో హాట్‌స్టార్ ప్రకటించిన 'గుడ్ వైఫ్' సిరీస్ లో నేషనల్ అవార్డు గ్రహీత ప్రియామణి ప్రధాన పాత్రలో నటిస్తుంది. ప్రముఖ నటి మరియు చిత్రనిర్మాత రేవతి ఈ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఇప్పుడు మేకర్స్ ఈ సిరీస్ జులై 4న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఇది తెలుగుతో సహా పలు భారతీయ భాషలలో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సిరీస్ అమెరికన్ లీగల్-పొలిటికల్ డ్రామా ది గుడ్ వైఫ్ యొక్క అధికారిక అనుసరణగా నిర్ధారించబడింది. సంపత్ రాజ్ మరియు ఆరి అర్జునన్ ఈ సిరీస్ లో కీలక పాత్రలు పోషించారు.
Latest News