![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 07:44 PM
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ కి చెందిన తేజస్విని వ్యాఘని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. దిల్ రాజు భార్య తేజస్విని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం తేజస్విని దిల్ రాజు నిర్మాణ సంస్థలో పలు ప్రాజెక్ట్స్ కి పనిచేస్తుంది కూడా. దిల్ రాజుతో పెళ్లి తర్వాత మొదటిసారి తేజస్విని ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో తన చదువు గురించి కూడా తెలిపింది. తేజస్విని మాట్లాడుతూ.. నేను హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాను. చిన్నప్పట్నుంచి నా స్టడీ అంతా హైద్రాబాద్ లోనే లేడీస్ స్కూల్ , కాలేజెస్ లోనే సాగింది. సెయింట్ యాన్స్ లో స్కూల్ చదివాను. శ్రీ చైతన్యలో ఇంటర్ చదివాను. కస్తూరి బా గాంధీ కాలేజీలో డిగ్రీ చదివాను. నాచారం సెయింట్ పియస్ కాలేజీలో బయో కెమిస్ట్రీలో పిజి చేశాను. మా అమ్మ హైకోర్టు అడ్వాకేట్. ఆమె కోసం పిజి తర్వాత పెండేకంటి లా కాలేజీ లో లా చదివాను. లా చదువుతున్నప్పుడే పెళ్లి అయింది. పెళ్లి అయ్యాక కూడా చదివాను. 2024 లోనే లా పూర్తి చేశాను. నేను స్టడీస్ లో మంచి స్టూడెంట్ నే అని తెలిపింది. తేజస్విని క్లాసికల్ డ్యాన్సర్ కూడా. గతంలో అనేక పర్ఫార్మెన్స్ లు కూడా ఇచ్చారట
Latest News