![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 12:20 PM
ప్రముఖ సినీనటి త్రిష చెన్నైకి చెందిన పీపుల్ ఫర్ క్యాటిల్ ఇండియా (పీఎఫ్‌సీఐ) అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి అరుప్పుకోట్టైలోని శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వవినాయకర్ ఆలయానికి ‘గజ’ అనే మెకానికల్ ఏనుగును బహూకరించారు. దీనిని సంప్రదాయ మంగళవాద్యాల మధ్య అందజేసినట్లు పీఎఫ్‌సీఐ నిర్వాహకులు తెలిపారు. ఆలయ వేడుకల కోసం మెకానికల్ ఏనుగును బహూకరించడం తమిళనాడులో ఇదే తొలిసారి.ఇదిలా ఉంటే.. ప్రస్తుతం త్రిష చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఇటీవలే థగ్ లైఫ్ సినిమాతో అలరించిన ఆమె.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. అలాగే తమిళంతోపాటు మలయాళంలోనూ పలు సినిమాల్లో నటిస్తున్నట్లు టాక్.
Latest News