![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 10:35 AM
బిగ్‌బాస్ నటి గుండెపోటుతో మరణం . నటి షెఫాలీ జరీవాలా (42) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో ఆమె చనిపోయారు. ముంబైలోని బెల్లెవ్యూ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌కు తీసుకువెళ్లే సరికి ఆమె చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. షెఫాలీ మరణం సినీ పరిశ్రమను, ఆమె అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. 2000 సంవత్సరం మొదట్లో ‘కాంటా లగా’ అనే పాటతో ఆమె బాగా పాపులర్ అయ్యారు. అలా ఆమె కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయింది. ఆమెకు కాంటా లగా గర్ల్ అనే పేరు వచ్చేసింది. షెఫాలీ జరీవాలా ను ఆమె భర్త పరాగ్ త్యాగి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికే షెఫాలీ చనిపోయిందని వైద్యులు తెలిపారు. షెఫాలీని ఆసుపత్రికి తీసుకువచ్చే ముందే ఆమె చనిపోయారు. ఆమె భర్త, మరికొందరు ఆమెతో ఉన్నారు అని హాస్పిటల్ టీం చెప్పింది. షెఫాలీ జరీవాలా మరణం చాలా మందికి షాక్‌ను కలిగించింది. ఇలా అకస్మాత్తుగా గుండె పోటు ఏంటి? మరణించడం ఏంటి? అని అంతా ఆశ్చర్యపోతోన్నారు.