![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 04:03 PM
ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సామాజిక-రాజకీయ నాటకం 'కుబేర' జూన్ 20, 2025న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూస్ ని అందుకుంటుంది. ఈ సినిమా ఇటీవలే 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది. ప్రత్యేకంగా తెలుగు స్టేట్స్ మరియు యుఎస్‌ఎలలో ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం జూలై 18, 2025 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని సోషల్ మీడియాలో సంచలనం పెరుగుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫారంనుండి అధికారిక ప్రకటన రావలిసి ఉంది. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, నాగార్జున ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. రష్మికా మాండన్న ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్రలలో నటించింది. ఈ సినిమాలో జిమ్ సర్బ్, దాలిప్ తాహిల్ మరియు సయాజీ షిండే కీలకమైన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా హ్యాండిల్ నికేత్ బొమ్మి, ఎడిటింగ్ కార్తీక శ్రీనివాస్ అందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి మరియు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Latest News