![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 03:41 PM
బాబ్జీ దర్శకత్వం వహించిన తాజా మరియు సృజనాత్మక రాబోయే చిత్రం 'పోలీస్ వారి హెచ్చరిక' లో సన్నీ అఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుండి ఇప్పటి వరకు విడుదలైన సాంగ్స్ కి భారీ స్పందన లభించింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్ ని టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు లాంచ్ చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియయజేసేందుకు మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో సన్నీ అఖిల్ కి జోడిగా ఖుషి మేఘన జోడిగా నటిస్తుంది. అజయ్ ఘోష్, శుభలేఖ సుధకర్, సయాజీ షిండే, రవి కాలే, హిమాజా, జయ వహిని, శంకరభరణం తులసి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. బెల్లి జానార్ధన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించి మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
Latest News