|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 03:44 PM
హరిప్రసాద్ కోనే, ఇషాని గోష్ జంటగా చైతన్య కొండా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'హ్యాపీ జర్నీ'. గంగాధర్ పెద్ద కొండ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. ఈ చిత్రం కొత్త పోస్టర్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవిష్కరించారు. బండి సంజయ్ మాట్లాడుతూ’’ ఈ కథ విన్న తర్వాతనే ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేయడానికి అంగీకరించాను. ప్రస్తుత పరిస్థితుల్లో సొసైటీలో అలజడులు ఇతివృత్తంతో ఎమోషనల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుంది. సామాజిక స్పృహ ఉన్న డైరెక్టర్, మంచి అభిరుచి ఉన్న నిర్మాత తీసిన సినిమా ఇది. హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి నా వంతు సపోర్ట్ చేస్తాను’’ అని అన్నారు.
Latest News