![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 06:41 PM
గతవారం డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చిన హిందీ సినిమా స్టోలెన్ ఓటీటీకి పట్టిన బూజును దులిపేస్తూ రికార్డ్ వ్యూస్‌తో సంచనం సృష్టిస్తోంది. కేవలం నాలుగైదు పాత్రల చుట్టూనే తిరిగే ఈ సినిమా అసాంతం సీట్ ఎడ్జ్‌లో కూర్చొబెడుతూ కళ్లు తిప్పనీయకుండా అదిరిపోయే థ్రిల్‌ను ఇస్తోంది. 2023లోనే విడుదలైప ఈ చిత్రం అనేక అవాంతరాలను అధిగమించి ఇటీవల ఓటీటీకి రాగా ప్రజలు ఇప్పుడు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. అరుదుగా వచ్చే మాబ్ లించింగ్ జానర్లో రూపొందిన ఈ చిత్రానికి గతంలో 3 ఇడియట్స్, లగేరహో మున్నాభాయ్ వంటి క్లాసిక్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన కరణ్ తేజ్ పాల్ రచన, దర్శకత్వం వహించడం విశేషం. అదేవిధంగా లేటెస్ట్ బాలీవుడ్ సెన్షేషన్ అభిషేక్ బెనర్జీ, శుభం వర్ధన్, మియా మెల్జర్ కీలక పాత్రలు పోషించారు. 2018లో అస్సాంలో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కటం విశేషం.
Latest News