![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 06:09 PM
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి కలవరపెడుతోంది. ఇప్పటికే చాపకింద నీరులా యాక్టివ్ కేసుల సంఖ్య 250 దాటడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ పరిస్థితుల దృష్ట్యా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ, అవసరమైన చర్యలు చేపడుతున్నాయి. వైద్య నిపుణులు కూడా ప్రజలు నిర్లక్ష్యం వీడి, మాస్కులు ధరించడం సహా అన్ని రకాల కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో, ప్రముఖ బాలీవుడ్ నటి నికితా దత్తా తాజాగా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. నికితా దత్తాతో పాటు ఆమె తల్లికి కూడా ఈ వైరస్ సోకింది.ఈ సందర్భంగా నికితా దత్తా తన పోస్ట్‌లో, "కొవిడ్ మా అమ్మగారికి, నాకు హలో చెప్పడానికి వచ్చింది. ఈ పిలవని అతిథి ఎక్కువ కాలం మాతో ఉండదని ఆశిస్తున్నాను. ఈ చిన్న క్వారంటైన్ తర్వాత మళ్లీ కలుద్దాం. అందరూ జాగ్రత్తగా ఉండండి," అని పేర్కొన్నారు. గతంలో కూడా నికితా దత్తా ఒకసారి కొవిడ్ బారిన పడి, చికిత్స అనంతరం కోలుకున్న విషయం గమనార్హం.
Latest News