![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 06:39 PM
టాలీవుడ్ యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం తండ్రయ్యాడు. కిరణ్ అబ్బవరం అర్ధాంగి రహస్య పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. ఈ సంతోషకరమైన వార్తను కిరణ్ అబ్బవరం స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.తనకు కుమారుడు పుట్టిన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, కిరణ్ ఓ భావోద్వేగభరితమైన ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలో, నవజాత శిశువు సున్నితమైన పాదాన్ని ఆయన ప్రేమగా ముద్దాడుతూ కనిపించారు. ఈ పోస్ట్ చూసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కిరణ్-రహస్య దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తించారు. వారి కుటుంబంలోకి వచ్చిన కొత్త సభ్యుడికి ఆశీస్సులు అందజేశారు.కిరణ్ అబ్బవరం, రహస్యల ప్రేమ ప్రయాణం ‘రాజావారు రాణిగారు’ సినిమా సెట్లో మొదలైంది. ఆ సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ ప్రేమలో పడి, పెద్దల అంగీకారంతో గతేడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరి జోడీకి అభిమానుల్లో మంచి ఆదరణ ఉంది.
Latest News