![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 06:28 PM
హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ (62) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అరవై ఏళ్ల వయసు దాటినా ఇప్పటికీ యువ హీరోలకు ధీటుగా యాక్షన్ సినిమాల్లో నటిస్తూ, ముఖ్యంగా డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో అందరినీ నివ్వెరపరుస్తోంది. అందులో ఆయన చేసిన సాహసం చూసి నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆ వీడియోలో, ఓ విమానం కొండల మధ్య చాలా తక్కువ ఎత్తులో వేగంగా ప్రయాణిస్తుండగా, టామ్ క్రూజ్ ఏమాత్రం భయం లేకుండా ఆ విమానం టైర్‌పై కూర్చుని కనిపించారు. ఈ దృశ్యం చూస్తుంటేనే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఈ వీడియోకి "చిన్న పొరపాటు చేసినా అంతే సంగతులు!" అని ఆయన క్యాప్షన్ కూడా జోడించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Latest News