![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 03:23 PM
యువ నటుడు సిద్ధార్ తన తదుపరి చిత్రాన్ని శ్రీ గణేష్ దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ '3 బిహెచ్కె' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని కలలన్ని నిజమయ్యే తరుణములే వచ్చే అనే టైటిల్ తో ఈరోజు సాయంత్రం 6 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అమ్రిత్ రామనాథ్ కంపోస్ చేసిన ఈ సాంగ్ కి హేమచంద్ర మరియు సాహితి తన గాత్రాలని అందించారు. ఈ చిత్రం జులై 4న విడుదల కానున్నట్లు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. మేకర్స్ ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ భారీ స్పందనను అందుకుంది. ఈ చిత్రంలో శరత్ కుమార్, దేవయానీ, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్రా మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ప్రఖ్యాత గాయకుడు బొంబాయి జయశ్రీ కుమారుడు అమృత్ రామ్నాథ్ సంగీత దర్శకుడిగా ఉండగా, దినేష్ కృష్ణన్ బి మరియు జిథిన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. గణేష్ శివ ఎడిటింగ్ ని చేస్తున్నారు.
Latest News