![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 08:28 AM
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన థ్రిల్లర్ హిట్ కి సీక్వెల్ 'హిట్ 2' సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకుల మన్ననలు పొందిన అడివి శేష్ ఈ సినిమాతో అందరినీ ఆకట్టుకున్నాడు. విలక్షణమైన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో సెటిల్ అయ్యి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన హిట్ 2 జూన్ 24న రాత్రి 10:30 గంటలకి జెమినీ టీవీ ఛానల్ లో స్మాల్ స్క్రీన్ పై ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి మహిళా ప్రధాన పాత్రల్లో నటించారు. జాన్ స్టీవర్ట్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాలో సుహాస్, దివ్య నారని కీలక పాత్రలో నటించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాని వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై నేచురల్ స్టార్ నాని నిర్మించారు.
Latest News