![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 02:22 PM
సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా అతడి కల్ట్ క్లాసిక్ ‘అతడు’ను ఆగస్టు 9న 4K టెక్నాలజీతో మళ్లీ థియేటర్లలో విడుదల చేయనున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2005లో విడుదలై ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేసింది. మహేశ్ బాబు స్టైలిష్ నటన, మణిశర్మ సంగీతం, త్రివిక్రమ్ సంభాషణలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. రీ-రిలీజ్‌తో మరోసారి అభిమానులకు పండుగలా మారనుంది.
Latest News