![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jul 13, 2025, 11:52 AM
కోటా శ్రీనివాసరావు మరణంపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇతర భాషల్లోనూ నటించి మెప్పించారని, MLAగానూ మంచి సేవలందించారని హీరో బాలకృష్ణ కొనియాడారు. ఎనలేని నటనాచాతుర్యం, ప్రతి పాత్రకు తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు అని జూ.ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఆయనతో నటించి, పంచుకున్న క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయమన్నారు. వీరితో పాటు హీరో రవితేజ, నటుడు మురళీమోహన్, ప్రకాశ్ రాజ్, రోజా తదితరులు సంతాపం తెలిపారు.
Latest News