![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 01:29 PM
మల్లేశం మరియు 8 A.M. మెట్రో చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు పొందిన డైరెక్టర్ రాజ్ ఆర్ ఇటీవలే "23" అనే మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తేజా, తన్మై ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొందింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలోని దొర పోగూక ఫుల్ వీడియో సాంగ్ ని మేకర్స్ ఈరోజు సాయంత్రం 6 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ వీడియో సాంగ్ ఆదిత్య మ్యూజిక్ మరియు యూట్యూబ్ లో ప్రసారానికి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. సినిమాటోగ్రఫీని సన్నీ కురాపతి నిర్వహిస్తుండగా, సంగీతాన్ని మార్క్ కె రాబిన్ స్కోర్ చేశారు. ఈ సినిమాని స్టూడియో 99, స్పిరిట్ మీడియా పై నిర్మించారు. ఈ చిత్రంలో జాన్సీ, పవన్ రమేష్, రమేష్ మరియు ప్రనీత్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. సాంకేతిక సిబ్బందిలో దర్శకుడు రాజ్ ఆర్ సినిమాటోగ్రాఫర్ సన్నీ కురాపతి, సంగీత స్వరకర్త మార్క్ కె రాబిన్ మరియు ఎగ్జిక్యూటివ్ నిర్మాత వెంకట్ సిద్దారెడి ఉన్నారు.
Latest News