![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 25, 2025, 03:46 PM
టాలీవుడ్ లో ఇటీవల విడుదలైన సూపర్ హిట్ చిత్రం 'కుబేర' ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద బలంగా ఉంది. ఈ సినిమాలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలో నటించారు. రష్మిక మందాన ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాకి అన్ని చోట్ల నుండి ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమా విడుదలైన నాలుగు రోజులలో 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యి సెన్సషనల్ రికార్డు ని సృష్టించింది. ఐదవ రోజున ఈ చిత్రం దాని స్థిరమైన పరుగును కొనసాగించింది. సుమారు నైజాం ప్రాంతంలో 1 కోటి (జిఎస్‌టితో సహా) వాసులు చేసింది. దీనితో ఈ ప్రాంతంలో మొత్తం ఈ సినిమా షేర్ 12 కోట్లు (జీఎస్టీతో సహా) చేరుకుంది. ఈ చిత్రానికి కెమెరా హ్యాండిల్ నికేత్ బొమ్మి, ఎడిటింగ్ కార్తీక శ్రీనివాస్ అందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి మరియు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సామాజిక-రాజకీయ నాటకంలో జిమ్ సర్బ్, దాలిప్ తాహిల్ మరియు సయాజీ షిండే కీలకమైన పాత్రలలో నటిస్తున్నారు.
Latest News