![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 03:53 PM
ప్రతిష్టాత్మమైన GAMA అవార్డ్స్ కు టాలీవుడ్‌లో స్పెషల్ క్రేజ్ ఉంది. దుబాయ్‌లో ఇప్పటికే నాలుగు ఎడిషన్లు అంగరంగ వైభవంగా జరిగాయి. తాజాగా ఈ ఏడాదికి సంబంధించి 5వ ఎడిషన్ వేడుకలు ఆగస్ట్ 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో గ్రాండ్‌గా జరగనుంది. దుబాయ్ లో జరిగిన Keinfra Properties ప్రారంభోత్సవ సందర్భంగా గామా 5వ ఎడిషన్ కు సంబంధించిన థీమ్ సాంగ్ ను శనివారం లాంఛ్ చేశారు. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు ఈ పాటకు సాహిత్యం అందించారు. రఘు కుంచె సాంగ్ కంపోజ్ చేయడంతో పాటు తానే స్వయంగా పాడిన తీరు అందరినీ అలరించింది. ఈ సంగీత ప్రదర్శనను యూఏఈ లోని తెలుగు ప్రముఖులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఆగస్టు 30న టాలీవుడ్ అవార్డ్స్ తో పాటు ఆగస్టు 29న ఎక్సలెన్స్ అవార్డ్స్ వేడుకను నిర్వహించేలా భారీ సన్నాహాలు జరుగుతున్నాయి.
Latest News