![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 10:31 AM
కామెడీ డ్రామా సిరీస్ 'పంచాయత్' నాలుగో సీజన్ OTTలోకి వచ్చేసింది. ఈ రూరల్ కామెడీ డ్రామా సిరీస్‍లో నాలుగో సీజన్‍కు దీపక్ కుమార్, మిశ్రా, అక్షత్ విజయ్ వర్గీయ దర్శకత్వం వహించారు. జితేంద్ర కుమార్ ప్రధాన పాత్రలో కొనసాగారు. నీనా గుప్తా, రఘువీర్ యాదవ్, ఫైజల్ మాలిక్, చంద్రన్ రాయ్ కీలకపాత్రలు పోషించారు.ఫులేరా అనే గ్రామంలో పంచాయత్ వెబ్ సిరీస్ సాగుతుంది. ఆ గ్రామంలో పంచాయతీ ఎన్నికల చుట్టూ ఈ నాలుగో సీజన్ ఉండనుంది. ఈ సిరీస్‍ను ది వైరల్ ఫీవర్ పతాకం ప్రొడ్యూజ్ చేసింది. పంచాయత్ సీజన్ 4ను జూన్ 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసేయవచ్చు. ఈ నయా సీజన్‍పై కూడా చాలా అంచనాలు ఉన్నాయి.
Latest News