![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 07, 2025, 04:39 PM
కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన కాంతార చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి ప్రీక్వెల్‌గా రూపొందుతున్న కాంతార: ఏ లెజెండ్- చాప్టర్ 1 సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. సోమవారం రిషబ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన తాజా పోస్టర్‌లో ఆయన పవర్‌ఫుల్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిత్రం కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది.
Latest News