![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 08, 2025, 08:09 AM
పాన్ ఇండియా హీరో ప్రభాస్ రాబోయే చిత్రం 'రాజా సాబ్' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాకి మారుతీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ మూవీపై భారీ హైప్ ని క్రియేట్ చేసింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా క్రియేటివ్ ప్రొడ్యూసర్ SKN పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా సెట్స్ లో సెలెబ్రేట్ చేసారు. ఈ సెలెబ్రేషన్స్ కి సంబందించిన చిత్రాలని మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. హర్రర్-కామెడీగా పేర్కొన్న ఈ చిత్రంలో సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాలవిక మోహానన్, రిద్ది కుమార్, ప్రభాస్ శ్రీను, బోమన్ ఇరానీ, విటివి గణేష్, సప్తాగిరి, సముతీరకాని మరియు యోగి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గ్రాండ్ స్కేల్‌లో నిర్మించిన రాజా సాబ్ డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా బహుళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని నిర్ధారించబడింది. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నాడు.
Latest News