![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 08, 2025, 07:28 AM
శ్రీ గణేష్ దర్శకత్వంలో యువ నటుడు సిద్ధార్ ప్రధాన పాత్రలో నటించిన '3 బిహెచ్‌కె' చిత్రం జులై 4న తెలుగు, తమిళంలో విడుదల అయ్యింది. ఈ సినిమాని తెలుగులో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP బ్యానర్ విడుదల చేసింది. ఈ సినిమాకి విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ లభిస్తున్నాయి. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రధాన నటులు ఈరోజు అంటే జులై 8న హైదరాబాద్ లో మీట్ అండ్ గ్రీట్ లో భాగంగా ప్రేక్షకులతో కలిసి సినిమాని వీక్షించనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో శరత్ కుమార్, దేవయానీ, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్రా మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ప్రఖ్యాత గాయకుడు బొంబాయి జయశ్రీ కుమారుడు అమృత్ రామ్‌నాథ్ సంగీత దర్శకుడిగా ఉండగా, దినేష్ కృష్ణన్ బి మరియు జిథిన్ సినిమాటోగ్రఫీని, గణేష్ శివ ఎడిటింగ్ ని నిర్వహిస్తున్నారు. శాంతి టాకీస్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు.
Latest News