![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 05:48 PM
ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబుకు సంబంధించిన కేసు విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ మోహన్‌బాబు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉండగా, న్యాయస్థానం తదుపరి విచారణను జూలై 3వ తేదీకి వాయిదా వేసింది. గతంలో రంజిత్ అనే విలేకరిపై దాడి చేశారన్న ఆరోపణలతో మోహన్‌బాబుపై పహాడీషరీఫ్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును కొట్టి వేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసుకు సంబంధించి మోహన్‌బాబుకు ఇదివరకే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Latest News