![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 03:29 PM
సిద్ధార్థ్, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న కుటుంబ కథా చిత్రం 3BHK. గత సంవత్సరం శివకార్తికేయన్‌తో మావీరన్‌తో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిర్మాత అరుణ్ తన తదుపరి చిత్రంగా విశ్వ శాంతి టాకీస్‌పై తమిళ్, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ మిస్కిన్ అసిస్టెంట్ శ్రీగణేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. దేవయాని, మీతా రఘునాథ్, చైత్ర జే ఆచార్, యోగి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూలై4న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్, టీజర్లు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకోగా తాజాగా ఆగిపోను నేను చిన్నా.. దేవుడు అడ్డుకున్నా అంటూ సాగే మంచి ఇన్సిపిరేషన్ పాటను రిలీజ్ చేశారు. దేవ సాహిత్యం అందించడంతో పాటు సిద్‌ధార్థ్‌తో పాటు కలిసి పాట పాడి వీడియోలో పెర్‌ఫార్మ్ చేశాడు. అమృత్ రామ్‌నాథ్ మ్యూజిక్ అందించారు. కాగా ఈ పాటను సైతం గతంలో రిలీజ్ చేసిన కలలన్నీ పాట మాదిరిగానే ప్రత్యేకంగా సింగర్‌తోనే రూపొందించడమే కాక చైల్డ్ ఆర్టిస్ట్స్‌తో స్టోరీ చెబుతూ విజువల్‌గా వావ్ అనిపించారు.
Latest News