![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 25, 2025, 05:24 PM
చాలా కాలం తర్వాత మన టాలీవుడ్ ట్రేడ్ పండితులు కుబేర పుణ్యమా అని కలెక్షన్స్ గురించి లెక్కలు వేసుకుంటున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సీజన్ తర్వాత టాలీవుడ్ నుండి విడుదలైన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేదు. మధ్యలో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి కానీ బయ్యర్స్ చేతిలో భారీ లాభాలను తెచ్చి పెట్టిన చిత్రాలు మాత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘కోర్ట్’ మరియు ‘సింగిల్’ చిత్రాలు మాత్రమే. అలాంటి గడ్డు పరిస్థితి ని ఎదురుకుంటున్న సమయం లో ‘కుబేర’ చిత్రం విడుదలై మళ్ళీ బయ్యర్స్ ముఖం లో ఆనందం నింపింది. విడుదలై 5 రోజులను ఈ చిత్రం పూర్తి చేసుకుంది. భారీ వీకెండ్ తర్వాత కూడా వర్కింగ్ డేస్ లో స్టడీ కలెక్షన్స్ ని నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది ఈ చిత్రం. మరి ఈ 5 రోజుల్లో ఎంత ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో నాల్గవ రోజున 3 కోట్ల 12 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ హోల్డ్ ని కనబర్చిన ఈ చిత్రానికి 5వ రోజున 2 కోట్ల 39 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అలా మొదటి 5 రోజుల్లో ఈ చిత్రానికి 27 కోట్ల 32 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు,46 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు ఈ చిత్రానికి వచ్చాయి. ఇంకో 6 కోట్ల 68 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్న సినిమాగా నిలుస్తుంది. అందుకు మరో రెండు రోజుల సమయం అవసరం అవ్వొచ్చు. ఓవరాల్ గా పది రోజుల్లో ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 98 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 49 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. అయితే తమిళనాడు ప్రాంతంలో మాత్రం ఈ సినిమా భారీ నష్టాలను చవిచూసే విధంగా ముందుకు దూసుకుపోతుంది. మొదటి 5 రోజులకు కలిపి ఈ చిత్రానికి కేవలం 16 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చిందట. ఈ వీకెండ్ లో వచ్చే వసూళ్లు అత్యంత కీలకం కానుంది. పూర్తి స్థాయి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కచ్చితంగా రాబట్టాల్సిందే. కానీ ప్రస్తుత ట్రెండ్ ప్రకారం 30 కోట్లకు మించి ఒక్క రూపాయి కూడా వచ్చేలా కనిపించడం లేదు. అదే విధంగా కర్ణాటక లో 7 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కేరళలో కోటి రూపాయిలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా లో 2 కోట్ల రూపాయిలు, ఓవర్సీస్ లో పాతిక కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 16 కోట్లు రాబట్టాల్సిందే.
Latest News