![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 03:42 PM
వివిధ రంగాల్లో ప్రతిభ చూపించిన వారి కృషికి మంచి గుర్తింపు ఇవ్వాలనే ప్రయత్నంతో విజన్ స్టూడియోస్ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 పేరుతో అవార్డ్స్ అందించారు. సినీ, విద్యా, వైద్యం, రియల్ ఎస్టేట్..ఇలా పలు రంగాల్లో ఈ అవార్డ్స్ అందించారు. విజన్ స్టూడియోస్ మొదటి సారిగా నిర్వహించిన ఈ అవార్డ్స్ ఈవెంట్ హైదరాబాద్ లోని ఓ హోటల్లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ రంగంతో పాటు ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ ఈవెంట్ లో అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ "రమేష్ కింద స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. పట్టుదలతో కష్టపడే తత్వం కలవాడు. ఆయన విజన్ స్టూడియోస్ స్థాపించి 11 ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్నాడు. ఈ రోజు ఈ అవార్డ్స్ కార్యక్రమానికి అతిథిగా రావడం సంతోషంగా ఉంది. హైదరాబాద్ ను బాలీవుడ్ సహా అన్ని సినిమాలకు కేంద్రంగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు హైదరాబాద్ లో సినీ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయబోతున్నాం. హైదరాబాద్ ఇన్ ఛార్జ్ మంత్రిగా నేను ఆ బాధ్యత వహిస్తాను. విజన్ స్టూడియోస్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ నా అభినందనలు తెలియజేస్తున్నా" అన్నారు.
Latest News