![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 04:00 PM
ఇటీవల బ్లైండ్ స్పాట్, ఎలెవన్ వంటి వరుస థ్రిల్లర్ సినిమాలతో మంచి విజయం దక్కించుకున్న నవీన్ చంద్ర మరోసారి ఓ వైవిధ్యభరిత చిత్రం ‘షో టైమ్’ తో అలరించేందుకు రెడీ అయ్యాడు. కామాక్షీ భాస్కర్ల, సీనియర్ నరేశ్ , రాజా రవీంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ పతాకంపై కిశోర్ గరికపాటి ఈ చిత్రాన్ని నిర్మించగా మదన్ దక్షిణామూర్తి దర్శకత్వం వహించాడు. టీ వినోద్‌రాజా సినిమాటోగ్రఫీ, శేఖర్ చంద్ర సంగీతం, శ్రీనివాస్ గవిరెడ్డి డైలాగ్స్ అందించారు. ఇప్పటికే షూటింగ్‌తో పాటు అన్ని రకాల కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై4 థియేటర్‌లో విడుదలకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ ట్రైలర్‌ను మంగళవారం ఓ ఈవెంట్ నిర్వహించి రిలీజ్ చేశారు. ఈట్రైలర్‌ను చూస్తుంటే ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. హీరో ఇంట్లో అలని స్నేహితుడు అనుకోకుండా చనిపోవడం, దీంతో హీరో పక్కనే ఉండ ఏ లాయర్‌ను పంప్రదించడం, ఆపై పోలీసుల రాకతో ఇంతకు హత్య చేసింది ఎవరు అనే పాయింట్‌తో సినిమాను రూపొందించినట్లు ఉండి ఇట్టే ఆకట్టుకుంటుంది.
Latest News