![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 03:47 PM
'షోలే' సినిమాలో టాప్ స్టార్స్ నటించారు. ఆ సినిమాతో స్టార్ డమ్ చూసిన వారూ ఉన్నారు. అయితే వారందరి కన్నా మిన్నగా 'షోలే' మూవీకే ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉండడం విశేషం. ఈ సినిమాను ఏ ఫార్మాట్ లో రూపొందించినా చూసి ఆనందించారు అభిమానులు. ప్రస్తుతం మోడరన్ టెక్నాలజీని ఉపయోగిస్తూ 'షోలే'ను రీస్టోరేషన్ చేశారు. నిజానికి ఈ చిత్రాన్ని 35 ఎమ్.ఎమ్. కెమెరాతో రూపొందించారు. తరువాత కొన్ని థియేటర్లలో 70 ఎమ్.ఎమ్.లో ప్రదర్శించారు. మరికొన్ని చోట్ల లెన్స్ ఉపయోగించి సినిమాస్కోప్ లోనూ ఆడించారు. దాదాపు ఈ సినిమా 20 యేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్ కట్ వర్షన్ దూరదర్శన్ లో ప్రదర్శించినప్పుడు కూడా అభిమానులు విశేషంగా తిలకించారు. కొన్నేళ్ళ క్రితం 'షోలే'ను 3డి ఫార్మాట్ లోనూ అందించారు. ఇలా పలు మార్లు పలు హంగులతో సాగిన 'షోలే' ఒరిజినల్ నెగటివ్ పాడయి పోయింది.దాంతో ముంబైలో అందుబాటులో ఉన్న 'షోలే' కాపీని, బ్రిటిష్ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో భద్రపరచిన కాపీని జోడించి దానితోనే మోడరన్ టెక్నాలజీని ఉపయోగిస్తూ 'షోలే'ను రీస్టోరేషన్ చేశారు. ఈ ప్రింట్ ను జూన్ 27వ తేదీన ఇటలీలోని ప్లాజా మేగోర్ లో ప్రదర్శించనున్నారు. యాభై ఏళ్ళ తరువాత ప్రీమియర్ షో గా 'షోలే' ప్రదర్శితమవ్వడమే కాదు, ఓ చరిత్రగా నిలచిపోతుందని మేకర్స్ అంటున్నారు.
Latest News