|
|
by Suryaa Desk | Fri, May 16, 2025, 11:15 AM
హీరో అశ్విన్ తాజాగా నటిస్తోన్ననటిస్తున్న మూవీ వచ్చినవాడు గౌతమ్. ఈ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ గురువారం హైదరాబాద్‌లోని AAA థియేటర్‌లో విడుదల చేసింది. అయితే ఈ కార్యక్రమంలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య పాల్గొంది.పాల్గొన్నది. దీంతో ఈ మూవీలో రమ్య నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఇటీవల రమ్య అక్క చిట్టి ఓ కస్టమర్‌ను అసభ్యకరంగా తిట్టి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.తిట్టినట్లు వార్తలు వచ్చాయి.ఇక రమ్య పెట్టే రీల్స్, వేసే స్టెప్పులకి జనాలు ఫిదా అవుతుంటారు. ట్రోలింగ్ చేస్తూ ఉన్నా, నెటిజన్లు బూతులతో రెచ్చిపోతూ ఉన్నా కూడా వాటికి ఘాటుగా సమాధానాలు ఇస్తూనే వెళ్తుంటుంది రమ్య. ఇక ఇప్పుడు ఈమె సినిమా ఈవెంట్లో మెరిసింది. చిట్టి పికిల్స్ రమ్య సినిమాల్లోకి వచ్చేస్తోంది అంటూ ఆమె వీడియోల్ని కట్ చేసి తెగ వైరల్ చేస్తున్నారు.