|
|
by Suryaa Desk | Sat, Oct 07, 2023, 03:05 PM
పూజాహెగ్డే జిమ్‌లో విపరీతంగా కసరత్తులు చేస్తుంది. దానికి కారణం పూజాకు యాక్షన్ కథలంటే ప్రాణం. ఆ తరహా కథల కోసం ఎంతోకాలంగా వేటలో ఉంది. అయితే అలాంటి అవకాశం ఇప్పటి వరకూ దక్కలేదు. కేవలం గ్లామర్ పాత్రలతోనే మెప్పిస్తూ దైసుకెళ్తోంది. పూరి జగన్నాథ్ ‘జనగణమన’లో యాక్షన్ పాత్ర చేేస అవకాశం దొరికినా.. ఆ చిత్రం ఆగిపోయింది. అయితే ఇప్పుడామె తన కలను నెరవేర్చుకునే పనిలో పడింది. ఇటీవల ఓ భారీ ప్రాజెక్ట్‌కు ఓకే చేసిందని సమాచారం. అందులో ఆమె పాత్ర పూర్తిగా యాక్షన జానర్‌లో ఉండబోతోందట, దీనికోసమే పూజ ప్రస్తుతం బాక్సింగ్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. జిమ్‌లో కఠిన కసరత్తులు చేస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలో నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడబోతుందని పూజా సన్నిహితుల నుంచి సమాచారం.
Latest News