|
|
by Suryaa Desk | Sat, Oct 18, 2025, 10:46 AM
టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మపై తూ.గో. జిల్లా రాజమండ్రిలో కేసు నమోదైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హిందూ దేవుళ్లు, ఇండియన్ ఆర్మీ, ఆంధ్రులను దూషించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. వర్మ ఇంటర్వ్యూ తీసుకున్న యాంకర్‌పై కూడా కేసు నమోదైనట్లు సమాచారం. వీరిద్దరినీ అరెస్ట్ చేసి క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
Latest News