|
|
by Suryaa Desk | Wed, Oct 08, 2025, 10:38 PM
ఇప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే. అటు కమెడియన్‌గా, నటుడిగా సునీల్ కూడా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.ఇద్దరూ తమ జీవితాల్లో అద్భుతమైన విజయాలు సాధించారు. కానీ ఈ ఘనతల వెనుక ఉన్న సంఘర్షణ మాత్రం చాలామందికి తెలియదు. ప్రాణస్నేహితులైన వీరిద్దరూ ఒకప్పుడు పంజాగుట్టలో ఓ చిన్న రూమ్‌లో ఉండే వారు. జీవితంలో ఏదైనా సాధించాలన్న ఆశయంతో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. అవకాశాల కోసం తిరుగుతూ, చాలాసార్లు తినడానికి కూడా డబ్బులు లేక ఆకలితో ఉండే పరిస్థితులు ఎదురయ్యాయి.ఒకసారి వీరి దగ్గర కేవలం రూ.25 మాత్రమే మిగిలి ఉండేది. ఆ డబ్బుతో మరుసటి రోజు ఇద్దరూ తినాలని సునీల్ ప్లాన్ చేశాడు. కానీ త్రివిక్రమ్ ఆ డబ్బుతో కూల్ డ్రింక్ తెచ్చాడు. "ఇది ఏమిటి? రేపు తినడానికి డబ్బులు ఏం చేస్తాం?" అని సునీల్ ఆశ్చర్యంగా అడిగాడు. అందుకు త్రివిక్రమ్ "రేపు చూస్కుందాం.. ఈ రోజు కూల్ డ్రింక్ తాగు, చల్లగా ఫీలవ్ అవ్" అన్నాడు.ఆ మాటలు సునీల్ మనసును మరిగించాయి. “ఇంత కూల్‌గా ఎలా ఆలోచిస్తాడు?” అనే ప్రశ్న అప్పటి నుంచి అతడిని వెంటాడింది. అప్పటినుంచే త్రివిక్రమ్ ఆలోచన విధానాన్ని ఫాలో అవడం సునీల్ ప్రారంభించాడు.త్రివిక్రమ్ తరచూ ఒక మాట చెబుతుంటాడు: “ఏ విషయానికీ భయపడకుండా ముందుకు పోవడమే ఒక మనిషి మొదటి విజయం."ఈ ఆత్మవిశ్వాసమే నేడు ఆయనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని ఆయన అభిమానులు గర్వంగా చెబుతుంటారు.
Latest News