|
|
by Suryaa Desk | Wed, Oct 08, 2025, 09:15 PM
ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్ కరూర్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై నటుడు రిషబ్ శెట్టి స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ దుర్ఘటన ఒకరి తప్పిదం వల్ల జరగదని, ఇది సమష్టి వైఫల్యమే అయి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ ఘటన దురదృష్టకరమని ఆయన అన్నారు.కరూర్ ఘటనపై స్పందించడానికి తనకు మాటలు రావడం లేదని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం నిజంగా దురదృష్టకరమని ఆయన అన్నారు. అందరూ ఒకేసారి రావడం వల్ల అభిమానులను లేదా పార్టీ కార్యకర్తలను నియంత్రించడంలో లోపం జరిగి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ప్రమాదాలు జరగవని ఆయన వ్యాఖ్యానించారు. మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు.ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు పోలీసులు, ప్రభుత్వాన్ని నిందించడం చాలా సులభమని, కానీ జనసమూహాన్ని నియంత్రించడంలో చాలా ఇబ్బందులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సినిమా ప్రియులు నటీనటులను ఆరాధిస్తారని, గుడులు కూడా కడతారని గుర్తుచేశారు. అగ్ర హీరోల చిత్రాలు విడుదలైన సమయంలో పాలాభిషేకాలు చేయడం కూడా చూస్తుంటామని తెలిపారు.
Latest News