|
|
by Suryaa Desk | Tue, Oct 07, 2025, 05:13 PM
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'కాంతార చాప్టర్ 1' చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే ఎందరో ప్రముఖులు ప్రశంసలు కురిపించగా, తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా చేరాడు. ఇటీవల ఈ సినిమా చూసిన ఆయన, రిషబ్ శెట్టి పనితీరుకు మంత్రముగ్ధుడయ్యాడు. ఈ సినిమా అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో సినిమా ట్రైలర్‌ను పంచుకుంటూ తన అనుభవాన్ని పంచుకున్నాడు. "ఇప్పుడే కాంతార చాప్టర్ 1 చూశాను. రిషబ్ శెట్టి మరోసారి సృష్టించిన మ్యాజిక్‌కు మాటలు రావడం లేదు. మంగళూరు ప్రజలను, వారి నమ్మకాలను ఎంతో అందంగా, హృద్యంగా తెరపై ఆవిష్కరించారు" అని రాసుకొచ్చాడు.
Latest News