|
|
by Suryaa Desk | Tue, Oct 07, 2025, 05:10 PM
శింబూ కథానాయకుడిగా వెట్రి మారన్ ఒక సినిమా చేయనున్నాడనే విషయం బయటికి రాగానే, అందరిలో ఆసక్తి మొదలైంది. ఎందుకంటే దర్శకుడిగా వెట్రిమారన్ స్టైల్ పూర్తి భిన్నంగా ఉంటుంది. సహజత్వానికి ఆయన ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాడు. గతంలో హీరో సూర్యతో కలిసి వెట్రి మారన్ ఒక సినిమా చేయవలసి ఉంది. కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. అదే కథను శింబూతో చేస్తున్నాడనే టాక్ మొదలైంది. అయితే వెట్రి మారన్ తాను తాయారు చేసుకున్న కథను బట్టే ఆర్టిస్టులను ఎంపిక చేసుంటాడు. కాంబినేషన్ ను బట్టి కథ రెడీ చేయడం ఆయనకి అలవాటు లేని పని. అందువలన ఆయన సూర్యకి చెప్పింది ఈ కథ కాదు అనే క్లారిటీ వస్తూనే ఉంది. శింబూతో ఆయన చేస్తున్న సినిమాకి 'అరసన్' అనే పేరు పెట్టారు. తాజాగా టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఒక సైకిల్ దగ్గర శింబూ పట్టా కత్తి పట్టుకుని నిలబడటం ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. యాక్షన్ .. ఎమోషన్ నేపథ్యంలో ఈ కథ సాగనున్నట్టుగా చెబుతున్నారు. తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాను గురించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Latest News