|
|
by Suryaa Desk | Mon, Oct 06, 2025, 04:34 PM
టాలీవుడ్ క్రేజీ జంటగా పేరుతెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిశ్చితార్థం చేసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతోంది. గత రెండు రోజులుగా ఈ ప్రచారం జోరుగా సాగుతున్నా, దీనిపై ఇటు విజయ్ గానీ, అటు రష్మిక గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఈ ఊహాగానాల మధ్య రష్మిక పెట్టిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లను పక్కనపెట్టి, ఆమె తన వృత్తిపరమైన పనులపైనే దృష్టి పెట్టినట్లు ఈ పోస్ట్ స్పష్టం చేస్తోంది.తన కొత్త హిందీ చిత్రం ‘థామా’ షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని ఆమె అభిమానులతో పంచుకున్నారు. సుమారు 12 రోజుల పాటు ఓ అందమైన లొకేషన్‌లో సినిమా షూటింగ్ జరిపామని, చివరి రోజున దర్శకులు, నిర్మాతలకు అప్పటికప్పుడు ఓ ఆలోచన వచ్చిందని రష్మిక తన పోస్ట్‌లో పేర్కొన్నారు. "అదే ప్రదేశంలో ఓ పాటను ఎందుకు చిత్రీకరించకూడదు అని వాళ్లు అనుకున్నారు. ఆ ఆలోచన, లొకేషన్ అందరికీ నచ్చడంతో వెంటనే పని మొదలుపెట్టాం" అని ఆమె తెలిపారు.మూడు, నాలుగు రోజుల పాటు రిహార్సల్స్ చేసి పాటను పూర్తి చేశామని రష్మిక వివరించారు.
Latest News