|
|
by Suryaa Desk | Mon, Oct 06, 2025, 01:52 PM
కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ) కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మహిళల గృహ నిర్వహణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటిని చక్కబెట్టడం, భర్త, పిల్లల కోసం వంట చేయడం, వేళకు పనులు చేయడం అంత తేలికైన పనికాదని, కొవిడ్ సమయంలో పురుషులు చాలామందికి ఈ విషయం అర్థమైందని ఆయన అన్నారు. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో ఉన్నవారికి ఆ పనులు చేయడం ఎంత కష్టమో తెలిసింది అని బిగ్ బీ పేర్కొన్నారు. ఆయన మాటలకు వేదిక మొత్తం చప్పట్లతో మారుమోగింది.
Latest News