|
|
by Suryaa Desk | Sat, Oct 04, 2025, 10:51 AM
ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ బాలల పట్ల జరుగుతున్న సైబర్ నేరాలపై ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ముంబైలో జరిగిన సైబర్ అవగాహన కార్యక్రమం ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ, తన కుమార్తెకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. ఆన్‌లైన్ గేమ్ ఆడుతున్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తి అసభ్యకరమైన చిత్రాలు పంపమని అడగడం సైబర్ నేరమేనని ఆయన తెలిపారు. మహారాష్ట్రలో 7, 8, 9, 10 తరగతులకు ప్రతి వారం సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రిని కోరారు.
Latest News