|
|
by Suryaa Desk | Fri, Oct 03, 2025, 06:15 PM
వరుణ్ ధావన్ మరియు జాన్వి కపూర్ యొక్క రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'సన్నీ సంస్కరి కి తులసి కుమారి' అక్టోబర్ 2న విడుదల అయ్యింది. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మిశ్రమ సమీక్షలని అందుకుంటుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రం థియేట్రికల్ విడుదలైన ఎనిమిది వారాల తర్వాత మాత్రమే OTTకి చేరుకుంటుంది. ఈ చిత్రంలో సన్యా మల్హోత్రా, రోహిత్ సారాఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మనీష్ పాల్, అక్షయ్ ఒబెరాయ్, మరియు అభినావ్ శర్మ సహాయక పాత్రలలో నటించారు. కరణ్ జోహార్ మరియు శశాంక్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని నిర్మించారు.
Latest News