|
|
by Suryaa Desk | Wed, Sep 24, 2025, 10:58 AM
ఒకప్పుడు హీరోయిన్ గా రాణించి, ఇప్పుడు కనుమరుగైన నటి మమతా మోహన్ దాస్, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్టార్ హీరోయిన్ నయనతారపై పరోక్షంగా షాకింగ్ కామెంట్లు చేశారు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కథానాయకుడు' సినిమాలో ఒక పాట కోసం షూటింగ్ చేసినప్పుడు, హీరోయిన్ నయనతార కారణంగా తనకు అన్యాయం జరిగిందని మమతా ఆరోపించారు. హీరోయిన్ షూటింగ్ లో ఉంటే తాను రాను అని నయనతార చెప్పడంతో, మమతాను కేవలం ఒకే ఒక్క షాట్ లో వెనకనుంచి కనిపించేలా చేశారని ఆమె తెలిపారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Latest News