|
|
by Suryaa Desk | Mon, Sep 22, 2025, 10:00 PM
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా పాన్-ఇండియా చిత్రం "మిరాయ్"తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ సమీక్షలని అందుకుంటుంది. ఈ యాక్షన్ డ్రామా సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ చిత్రం విడుదలైన పది రోజులలో ప్రపంచవ్యాప్తంగా 134.40 కోట్లు వాసులు చేసింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమ్నేని సినిమాటోగ్రఫీ మరియు స్క్రీన్‌ప్లే రెండింటినీ నిర్వహించారు. మంచు మనోజ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రితిక నాయక్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో శ్రియా సరన్, జయరం, జగపతి బాబు, శ్రీను, వెంకటేష్ మహా కూడా కీలక పాత్రల్లో నటించారు. శ్రీ నాగేంద్ర తంగల కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమని టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించారు. గౌర హరి ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.
Latest News