|
|
by Suryaa Desk | Mon, Sep 22, 2025, 04:37 PM
నందమురి బాలకృష్ణ యొక్క ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ అఖండ 2: తాండవం పై భారీ హైప్ ఉంది. ఈ చిత్రం పాన్ ఇండియన్ గా విడుదల కానుంది. ఈ యాక్షన్ డ్రామాలో సంయుక్త హీరోయిన్ గా, ఆది పినిసెట్టి విలన్ గా నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా కొత్త విడుదల తేదీ త్వరలో ప్రకటించబడుతుంది. ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా OTT డీల్ 104 కోట్లకి క్లోజ్ అయ్యినట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, బజ్రంగి భైజాన్ పాత్రకు ప్రసిద్ధి చెందిన హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలలో నటిస్తున్నారు. రామ్ అచంటా మరియు గోపినాథ్ అచంటా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ కింద అఖండ 2 ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Latest News