|
|
by Suryaa Desk | Mon, Sep 22, 2025, 12:46 PM
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘మా వందే’ కోసం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మోదీ పాత్రలో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. నేడు ముకుందన్ పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకుల ముందు కొత్త పోస్టర్‌ను ప్రదర్శించింది మూవీ టీమ్. ఈ బయోపిక్ విశేషాలను పంచుకుంటూ.. మోదీ జీవితంలో ముఖ్య ఘటనలు, స్ఫూర్తిదాయక క్షణాలను ప్రదర్శించబోతున్నట్లు తెలిపింది.ఇందులో మోదీ జనం ఎదుట స్టేజీపై నడుస్తున్నట్లుగా ఉంది. అతడి ఆశయాన్ని, సంకల్పాన్ని తల్లి ఆశీర్వదిస్తున్నట్లుగా పోస్టర్‌లో చూపించారు. ఈ మూవీలో మోదీ బాల్యం నుంచి నేటి వరకు జరిగిన ఎన్నో అంశాలను చూపించనున్నారు. వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని కీలక ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ ప్రపంచనాయకుడిగా ఎదగడం వెనక ఆయన మాతృమూర్తి హీరాబెన్ ప్రేరణ ఎంతో ఉంది. దీన్ని ఆధారంగా చేసుకుని.. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్ప బలం గొప్పదనే సందేశం ఇవ్వనున్నారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు దేశంలో ఉన్న అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు.
Latest News